మధ్య స్థాయి ఫీచర్‌లకు, అధునాతన ఫీచర్‌లకు యాక్సెస్‌ను పొందడానికి YouTube క్రియేటర్‌లు, ఈ ఆర్టికల్‌లో వివరించిన వెరిఫికేషన్ దశలను పూర్తి చేయాలి. స్కామర్‌లు, స్పామర్‌లు, ఇతర మోసపూరితమైన వ్యక్తులు లేదా సంస్థలు, హాని తలపెట్టాలని చేసే ప్రయత్నాలను కష్టతరం చేయడం ద్వారా, ఈ వెరిఫికేషన్‌లు YouTube కమ్యూనిటీని సురక్షితంగా ఉంచుతాయి.
మధ్య స్థాయి ఫీచర్‌లను యాక్సెస్ చేయండి
ఫోన్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి
మీరు ఫోన్ వెరిఫికేషన్‌ను పూర్తి చేస్తే, మధ్య స్థాయి ఫీచర్‌లకు మీకు యాక్సెస్ లభిస్తుంది. అధునాతన ఫీచర్‌లను ఎలా యాక్సెస్ చేయాలి అన్నది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
- కంప్యూటర్‌లో, YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
- సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
- ఛానెల్‌ను క్లిక్ చేయండి.
- ఫీచర్ అర్హత
మధ్య స్థాయి ఫీచర్‌లు
ఫోన్ నంబర్‌ను వెరిఫై చేయండిని క్లిక్ చేయండి.
ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మేము ఆ ఫోన్ నంబర్‌కు టెక్స్ట్ లేదా వాయిస్ కాల్ ద్వారా వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతాము.
అధునాతన ఫీచర్‌లను యాక్సెస్ చేయండి
అధునాతన ఫీచర్‌లలో కామెంట్‌లను పిన్ చేయగల సదుపాయంతో పాటు రోజూ మరిన్ని వీడియోలను అప్‌లోడ్ చేసుకోగల సదుపాయం వంటివి ఉంటాయి. ఈ కింద పేర్కొన్న పనులు చేయడం ద్వారా క్రియేటర్‌లు అధునాతన ఫీచర్‌లకు యాక్సెస్ పొందవచ్చు:
- ఫోన్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయడం ద్వారా
- సరిపడా ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకోవడం ద్వారా లేదా చెల్లుబాటయ్యే IDని ఉపయోగించి లేదా వీడియోను ఉపయోగించి ఐడెంటిటీని వెరిఫై చేయడం ద్వారా
- గమనిక: IDని, ఇంకా వీడియోను ఉపయోగించి వెరిఫికేషన్‌ను పూర్తి చేసే సదుపాయం క్రియేటర్‌లు అందరికీ అందుబాటులో ఉండదు.
1వ దశ. ఫోన్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి
మీ ఫోన్ నంబర్‌ను వెరిఫై చేయడానికి:
- కంప్యూటర్‌లో, YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
- సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
- ఛానెల్‌ను క్లిక్ చేయండి.
- ఫీచర్‌ల అర్హత
మధ్య స్థాయి ఫీచర్‌లు
ఫోన్ నంబర్‌ను వెరిఫై చేయండి ని క్లిక్ చేయండి.
-
ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మేము ఆ నంబర్‌కు టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ లేదా ఫోన్ కాల్ ద్వారా కానీ వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతాము.
2వ దశ. ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకోండి లేదా IDతో కానీ, లేదా వీడియోతో కానీ వెరిఫై చేయండి
ఫోన్ వెరిఫికేషన్ దశ పూర్తి అయ్యాక మీరు, సరిపడా ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకొనే ఆప్షన్‌ను లేదా, IDని లేదా వీడియోను ఉపయోగించి వెరిఫికేషన్‌ను పూర్తి చేసే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. IDని, వీడియోను ఉపయోగించి వెరిఫికేషన్‌ను పూర్తి చేసే సదుపాయం క్రియేటర్‌లు అందరికీ అందుబాటులో ఉండదని గమనించండి.
మీ ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసి, మెయింటైన్ చేయండి
మీ ఛానెల్ హిస్టరీలో, ఈ కింద అందించిన డేటా ఉంటుంది:
- ఛానెల్ యాక్టివిటీ (వీడియో అప్‌లోడ్‌లు, లైవ్ స్ట్రీమ్‌లు, ఇంకా ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్ వంటివి)
- మీ Google ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత డేటా:
- మీ ఖాతా ఎప్పుడు క్రియేట్ అయింది, ఎలా క్రియేట్ అయింది
- మీ ఖాతాను ఎంత తరచుగా ఉపయోగిస్తారు
- Google సర్వీస్‌లకు మీరు కనెక్ట్ అయ్యే పద్ధతి
ID వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి
చెల్లుబాటు అయ్యే IDతో మీ ఐడెంటిటీని వెరిఫై చేయడానికి:
- కంప్యూటర్‌లో, YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
- సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
- ఛానెల్‌ను క్లిక్ చేయండి.
- ఫీచర్ అర్హత
అధునాతన ఫీచర్‌లు
ఫీచర్‌లను యాక్సెస్ చేయండిని క్లిక్ చేయండి.
- మీ IDని ఉపయోగించండిని ఎంచుకుని, ఆపై ఈమెయిల్‌ను పొందండిని క్లిక్ చేయండి. Google మీకు ఈమెయిల్ పంపుతుంది. బదులుగా, మీరు QR కోడ్‌ను కూడా స్కాన్ చేయవచ్చు.
- మీ ఫోన్‌లో, ఈమెయిల్‌ను తెరిచి, వెరిఫికేషన్‌ను ప్రారంభించండిని ట్యాప్ చేయండి.
- Google మీ IDని ఎలా ఉపయోగిస్తుంది, మీ ID ఎలా స్టోర్ చేయబడుతుంది అనే విషయాలను తెలిపే వివరణను చదవండి. వెరిఫికేషన్‌ను కొనసాగించడానికి, నేను అంగీకరిస్తున్నానును క్లిక్ చేయండి.
- మీ IDకి సంబంధించిన ఫోటోను తీయడానికి ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి. గమనిక: మీ IDలోని పుట్టిన తేదీ మీ Google ఖాతాలో పేర్కొన్న పుట్టిన తేదీతో మ్యాచ్ అవుతోందని నిర్ధారించుకోండి.
- సబ్‌మిట్ చేయండిని క్లిక్ చేయండి. సబ్‌మిట్ చేసిన తర్వాత, మేము మీ IDని రివ్యూ చేస్తాము. దీనికి సాధారణంగా 24 గంటలు పడుతుంది.
మీ ID వెరిఫికేషన్ డేటా ఎలా ఉపయోగించబడుతుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
వీడియో వెరిఫికేషన్‌ను పూర్తి చేయండి
వీడియోతో ఐడెంటిటీని వెరిఫై చేయడానికి:
- YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
- సెట్టింగ్‌లు
ను క్లిక్ చేయండి.
- ఛానెల్‌ను క్లిక్ చేయండి.
- ఫీచర్ అర్హత
అధునాతన ఫీచర్‌లు
ఫీచర్‌లను యాక్సెస్ చేయండిని క్లిక్ చేయండి.
- వీడియో వెరిఫికేషన్‌ను ఉపయోగించండిని ఎంచుకొని, ఆపై తర్వాత, ఈమెయిల్‌ను పొందండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- Google మీకు ఒక ఈమెయిల్ పంపుతుంది. బదులుగా, మీరు QR కోడ్‌ను కూడా స్కాన్ చేయవచ్చు.
- మీ ఫోన్‌లో, ఈమెయిల్‌ను తెరిచి, వెరిఫికేషన్‌ను ప్రారంభించండిని ట్యాప్ చేయండి.
- డాట్‌ను ఫాలో కావడం, లేదా మీ తలను తిప్పడం వంటి చర్యలను చేయడానికి ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.
- మీ వెరిఫికేషన్ వీడియోను అప్‌లోడ్ చేయడం పూర్తయినప్పుడు, మేము మీ వీడియోను రివ్యూ చేస్తాము.
- రివ్యూకు సాధారణంగా 24 గంటలు పడుతుంది. ఆమోదం పొందినప్పుడు మీకు ఒక ఈమెయిల్ వస్తుంది.
మీ వీడియో వెరిఫికేషన్ డేటా ఎలా ఉపయోగించబడుతుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
సమస్యలను పరిష్కరించండి
ఫీచర్లకు యాక్సెస్ ఎందుకు ఆలస్యం కావచ్చో, ఆ యాక్సెస్‌ను ఎందుకు పరిమితం చేయవచ్చో అర్థం చేసుకోండి
ఏ చర్యల వల్ల అయితే ఛానెల్‌కు ఫీచర్ యాక్సెస్ ఆలస్యంగా లభించవచ్చో, లేదా ఫీచర్‌ల యాక్సెస్ విషయంలో ఛానెల్‌పై మరిన్ని పరిమితులు విధించవచ్చో, అలాంటి చర్యలకు కొన్ని ఉదాహరణలను దిగువున అందించాము. ఇది పూర్తి లిస్ట్ కాదని గుర్తుంచుకోండి:
- కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌ను అందుకోవడం
- ఒకటి లేదా అంత కన్నా ఎక్కువ ఛానెల్స్‌లో, ఒకే కంటెంట్‌ను పదే పదే పోస్ట్ చేయడం లేదా మీది కాని లేదా EDSA కోవలోకి రాని కంటెంట్‌ను పదే పదే అప్‌లోడ్ చేయడం
- దుర్వినియోగ, ద్వేషపూరిత, ప్రమాదకరమైన, లైంగికపరమైన, హింసాత్మకమైన మరియు/లేదా పీడించే వీడియోలను లేదా కామెంట్‌లను మళ్లీ మళ్లీ పోస్ట్ చేయడం
- స్పామ్ చేయడం, స్కామ్ చేయడం, తప్పుదారి పట్టించే మెటాడేటాను ఉపయోగించడం, ఖచ్చితత్వం లేని రిపోర్టింగ్, అలాగే మోసపూరిత పద్ధతులు
- సైబర్‌బెదిరింపు
- ఇతరుల లాగా నటించడం
- పిల్లల భద్రతకు సంబంధించిన మా పాలసీని ఉల్లంఘించడం
- పాలసీని ఉల్లంఘించే మరొక ఛానెల్‌కు సంబంధించిన ఛానెల్స్‌ను నిర్వహించడం (ఉదాహరణకు, పలు ఛానెల్స్‌కు ఓనర్ అయ్యి ఉండి తరచుగా స్పామ్ లేదా స్కామ్ చేసే వ్యక్తి)
- కాపీరైట్ స్ట్రయిక్‌లను అందుకోవడం
ఫీచర్‌లకు యాక్సెస్‌ను రీస్టోర్ చేసుకోండి
ఏవైనా అధునాతన ఫీచర్‌లకు మీకు ఉండే యాక్సెస్‌ను పరిమితం చేస్తే, ఒక ఈమెయిల్ వస్తుంది. క్రియేటర్‌లు, తమ ఛానెల్ హిస్టరీని మెరుగుపరుచుకోవడం ద్వారా లేదా చెల్లుబాటయ్యే IDని ఉపయోగించి లేదా వీడియోను ఉపయోగించి ఐడెంటిటీని వెరిఫై చేయడం ద్వారా యాక్సెస్‌ను రీస్టోర్ చేసుకోవచ్చు. IDని, వీడియోను ఉపయోగించి వెరిఫికేషన్‌ను పూర్తి చేసే సదుపాయం క్రియేటర్‌లు అందరికీ అందుబాటులో ఉండదని గుర్తుంచుకోండి.
యాక్టివ్‌గా ఉంటూ, YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను నిలకడగా ఫాలో అయ్యే ఛానెల్స్, సాధారణంగా 2 నెలల్లో, సరిపడా ఛానెల్ హిస్టరీని రీబిల్డ్ చేసుకోగలవు.
సాధారణంగా వచ్చే ఎర్రర్ మెసేజ్‌లు, వాటి అర్థం
- "ఈ ఖాతాకు అధునాతన YouTube ఫీచర్‌లు అందుబాటులో లేవు": అంటే మీరు ప్రధాన ఓనర్ కాని ఖాతాకు సైన్ ఇన్ చేశారని అర్థం. మీరు తల్లి/తండ్రి పర్యవేక్షిస్తున్న ఖాతాకు సైన్ ఇన్ చేసినా లేదా బ్రాండ్ ఖాతాకు సైన్ ఇన్ చేసినా ఇలా జరగవచ్చు.
- "మీ బ్రౌజర్‌ను చెక్ చేయండి": మీ బ్రౌజర్ అనుకూలమైనది కాదు. మీ పరికరాన్ని లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు, లేటెస్ట్ బ్రౌజర్ వెర్షన్‌కు తప్పక అప్‌డేట్ చేసుకోండి.
- "ఈ ఫోన్ కెమెరాతో ID వెరిఫికేషన్‌ను పూర్తి చేయడం సాధ్యం కాదు": మీ కెమెరా అనుకూలమైనది కాదు. మీ IDని సమర్పించడానికి, వెనుక వైపు ఫుల్ HD గల కెమెరా ఉన్న ఫోన్‌తో సైన్ ఇన్ చేయండి.
- "మరొక అప్లికేషన్ మీ కెమెరాను ఉపయోగిస్తూ ఉండవచ్చు. తెరిచి ఉన్న యాప్‌లను మూసివేసి, మళ్లీ ట్రై చేయండి": అంటే, మీ కెమెరాను మరొక యాప్ ఉపయోగిస్తోందని అర్థం. మీరు తెరిచిన యాప్‌లను మూసివేసి, మళ్లీ ట్రై చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
ఉల్లంఘించే కంటెంట్‌కు, ప్రవర్తనకు గాను YouTube ప్రతి సంవత్సరం లక్షలాది ఛానెల్స్‌ను రద్దు చేస్తుంది. ఈ ఛానెల్స్‌లో చాలా వరకు, అవే గ్రూప్‌లు లేదా వ్యక్తుల చేత క్రియేట్ అయ్యి ఉంటాయి, వీక్షకులను, క్రియేటర్‌లను, అడ్వర్టయిజర్‌లను మోసగించడం, స్కామ్ చేయడం, లేదా దుర్వినియోగం చేసే ప్రయత్నంలో భాగంగా ఒకే రకమైన ఫీచర్‌లను ఉపయోగించి లేదా ఎక్కువగా ఉపయోగించి, వారు ఇలా చేస్తారు. దుర్వినియోగాన్ని అరికట్టడానికి మేము ఫాలో అయ్యే మార్గాలలో మీ గుర్తింపును వెరిఫై చేయడం అనేది ఒకటి, దీని ద్వారా మీరు గతంలో మా పాలసీని ఉల్లంఘించారా, లేదా అని మేము గుర్తించి, మళ్ళీ మళ్ళీ ఉల్లంఘనలు జరగకుండా పరిమితం చేస్తాము.
ఫోన్ నంబర్
మీరు ఫోన్ నంబర్‌ను సమర్పించినట్లయితే, మేము దీన్ని ఇందుకు ఉపయోగిస్తాము:
- మీకు వెరిఫికేషన్ కోడ్‌ను పంపడానికి.
ID వెరిఫికేషన్
మీరు చెల్లుబాటయ్యే IDని (పాస్‌పోర్ట్ లేదా డ్రైవర్ లైసెన్స్ వంటివి) సమర్పించిన తర్వాత, మేము దాన్ని ఉపయోగించి, ఈ కింద ఉన్న వాటిని నిర్ధారిస్తాము:
- మీ పుట్టిన తేదీని
- మీ IDకి గడువు ముగియలేదని, అది చెల్లుబాటు అయ్యేదే అని
- YouTube పాలసీలను ఉల్లంఘించినందుకు మీరు మునుపెన్నడూ సస్పెండ్ కాలేదని
మోసాలు ఇంకా దుర్వినియోగం నుండి రక్షించడంలో, అలాగే మా వెరిఫికేషన్ సిస్టమ్‌లను మెరుగుపరచడంలో కూడా ఇది మాకు సహాయపడుతుంది.
2 సంవత్సరాల లోపు మీ Google ఖాతా నుండి మీ ID లేదా వీడియో వెరిఫికేషన్ ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది. ఇది సాధారణంగా, మీరు సరిపడా ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకున్న తర్వాత కొన్ని నెలల్లో కానీ, లేదా అధునాతన ఫీచర్‌లను ఉపయోగించకపోతే 1 సంవత్సరం తర్వాత కానీ తొలగించబడుతుంది. మీ వెరిఫికేషన్ డేటాను తొలగించడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
వీడియో వెరిఫికేషన్
వీడియో వెరిఫికేషన్ అనేది ఒక వ్యక్తి ముఖానికి సంబంధించిన చిన్న వీడియో. కింది వాటిని వెరిఫై చేయడంలో మాకు సహాయకరంగా ఉండేందుకు మేము ఈ వీడియోను ఉపయోగిస్తాము:
- మీరు బాట్ కాదని, నిజమైన వ్యక్తి అని
- Google సర్వీస్‌లను ఉపయోగించడానికి మీకు తగినంత వయస్సు ఉందని
- YouTube పాలసీలను ఉల్లంఘించినందుకు మీరు సస్పెండ్ కాలేదని
మోసాలు ఇంకా దుర్వినియోగం నుండి రక్షించడంలో, అలాగే మా వెరిఫికేషన్ సిస్టమ్‌లను మెరుగుపరచడంలో కూడా ఇది మాకు సహాయపడుతుంది.
2 సంవత్సరాల లోపు మీ Google ఖాతా నుండి మీ ID లేదా వీడియో వెరిఫికేషన్ ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది. ఇది సాధారణంగా, మీరు సరిపడా ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకున్న తర్వాత కొన్ని నెలల్లో కానీ, లేదా అధునాతన ఫీచర్‌లను ఉపయోగించకపోతే 1 సంవత్సరం తర్వాత కానీ తొలగించబడుతుంది. మీ వెరిఫికేషన్ డేటాను తొలగించడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
డేటా నిల్వ కొనసాగింపు, తొలగింపు
మీ Google ఖాతాలో మీరు ఏ సమయంలోనైనా మీ ID వెరిఫికేషన్‌ను లేదా వీడియో వెరిఫికేషన్‌ను తొలగించవచ్చు. మీ YouTube ఛానెల్ హిస్టరీని తగినంతగా బిల్డ్ చేసుకోక ముందే పైన పేర్కొన్న రెండింటిలో దేనినైనా తొలగిస్తే, మీరు ఈ కింది దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే అధునాతన YouTube ఫీచర్‌లను ఉపయోగించలేరని గమనించండి:
- మీ YouTube ఛానెల్ హిస్టరీని తగినంతగా బిల్డ్ చేసుకోవడం
లేదా
- ID లేదా వీడియో వెరిఫికేషన్‌ను మళ్లీ పూర్తి చేయడం
కొత్త ఖాతాలను క్రియేట్ చేయడం ద్వారా వ్యక్తులు లేదా గ్రూప్‌లు మా పరిమితులను తప్పించుకోకుండా చూసుకోవడానికి, మీరు గతంలో YouTube పాలసీలను ఉల్లంఘించారా, లేదా, అని మేము అంచనా వేసి, మళ్లీ మళ్లీ ఉల్లంఘించకుండా పరిమితం చేస్తాము. దుర్వినియోగం నుండి రక్షించడానికి Google కొంత కాలం పాటు మీ IDని లేదా మీ వీడియోను, ముఖ గుర్తింపు డేటాను సేవ్ చేయవచ్చు.
ఈ డేటా గరిష్ఠంగా YouTubeలో మీ చివరి ఇంటరాక్షన్ నుండి 3 సంవత్సరాల పాటు నిల్వ చేయబడుతుంది.
అధునాతన ఫీచర్‌లను అన్‌లాక్ చేయడానికి ID లేదా వీడియో వెరిఫికేషన్‌ను అందించాలని మీకు లేకపోతే, అందించకండి. బదులుగా మీరు సరిపడే ఛానెల్ హిస్టరీని ఎల్లప్పుడూ బిల్డ్ చేయవచ్చు. మీరు అధునాతన ఫీచర్‌లను అన్‌లాక్ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయానికి, సరిపడే హిస్టరీని మీరు ఎలాగూ బిల్డ్ చేసి ఉండవచ్చు.
మా సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా, మీ సమాచారాన్ని అందించడానికి మీరు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. ఇది ఒక పెద్ద బాధ్యత అని మేము అర్థం చేసుకున్నాము, అలాగే మీ సమాచారాన్ని రక్షించడానికి ఇంకా మీ కంట్రోల్‌లో ఉంచడానికి మేము తీవ్రంగా కృషి చేస్తాము. మా ప్రోడక్ట్‌లు, ఫీచర్‌లన్నింటికీ Google గోప్యతా పాలసీ ఏ విధంగా అయితే వర్తిస్తుందో, ఇక్కడ కూడా అదే విధంగా వర్తిస్తుంది.
గమనిక: మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ, ఎప్పుడూ విక్రయించము.
నేను ఇప్పటికే వెరిఫై చేశాను, వెరిఫై చేయమని నన్ను మళ్లీ ఎందుకు అడుగుతున్నారు?
మేము బాధ్యతాయుతమైన డేటా ప్రాక్టీసులను ఫాలో అవుతున్నామని నిర్ధారించుకోవడానికి, మీరు తగినంత ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసుకున్న తర్వాత మీ ID వెరిఫికేషన్ లేదా వీడియో వెరిఫికేషన్ ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది, లేదా 1 సంవత్సరం పాటు అధునాతన ఫీచర్‌లను ఉపయోగించకపోతే, మీ ID వెరిఫికేషన్ లేదా వీడియో వెరిఫికేషన్ తొలగించబడవచ్చు. మీ Google ఖాతాలోకి వెళ్లి ఏ సమయంలోనైనా మీరు మీ ID వెరిఫికేషన్‌ను లేదా వీడియో వెరిఫికేషన్‌ను తొలగించవచ్చు.
మీ వెరిఫికేషన్‌ను తొలగిస్తే, అధునాతన ఫీచర్‌లను ఉపయోగించడం కొనసాగించడానికి మీకు తగినంత ఛానెల్ హిస్టరీ ఉండాలి లేదా, ID వెరిఫికేషన్‌ను లేదా వీడియో వెరిఫికేషన్‌ను మీరు మళ్లీ సమర్పించాలి.
ID వెరిఫికేషన్ ద్వారా లేదా వీడియో వెరిఫికేషన్ ద్వారా అధునాతన ఫీచర్‌లను అన్‌లాక్ చేయాలనుకునే క్రియేటర్‌లు కూడా YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుందని, పాజిటివ్ ఛానెల్ హిస్టరీని మెయింటైన్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. సరిపడా ఛానెల్ హిస్టరీని బిల్డ్ చేసి, మెయింటైన్ చేయలేని క్రియేటర్‌లు, అధునాతన ఫీచర్‌లకు తమకు ఉండే యాక్సెస్‌ను కోల్పోవచ్చు. వారు ID వెరిఫికేషన్‌ను లేదా వీడియో వెరిఫికేషన్‌ను మళ్ళీ సమర్పించి యాక్సెస్‌ను రీస్టోర్ చేసుకోవచ్చు.
నా వెరిఫికేషన్ డేటాను నేను తొలగించుకోవడం ఎలా?
- మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
- ఎడమ వైపున ఉన్న, వ్యక్తిగత సమాచారాన్ని క్లిక్ చేయండి.
- గుర్తింపు డాక్యుమెంట్ లేదా వీడియో వెరిఫికేషన్‌ను క్లిక్ చేయండి.
- తొలగించండి
ని క్లిక్ చేయండి.
స్మార్ట్‌ఫోన్ అవసరం, ఎందుకంటే స్కామర్లు, స్పామ్ చేసే వ్యక్తులు హాని కలిగించడాన్ని కష్టతరం చేయడానికి అవసరమైన అదనపు భద్రతను ఇది అందిస్తుంది.
మీకు వెంటనే కోడ్ వస్తుంది. ఒకవేళ మీకు అందకపోతే, మీరు కొత్త కోడ్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. మీరు ఈ సాధారణ సమస్యలలో ఒక దాన్ని ఎదుర్కోవడం లేదని నిర్ధారించుకోండి:
- టెక్స్ట్ మెసేజ్ డెలివరీ ఆలస్యం కావచ్చు. జన సాంద్రత అధికంగా ఉన్న ఏరియాలలో గానీ లేదా మీకు బలమైన సిగ్నల్ లేకపోయినా గానీ ఆలస్యం జరగవచ్చు. మీరు కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు వేచి చూసినప్పటికీ మా టెక్స్ట్ మెసేజ్‌ను అందుకోలేకపోతే, వాయిస్ కాల్ ఆప్షన్‌ను ట్రై చేయండి.
- మీరు ఇప్పటికే 1 ఫోన్ నంబర్‌తో 2 ఛానెల్స్‌ను వెరిఫై చేసినట్లయితే, మీరు వేరొక ఫోన్ నంబర్‌తో వెరిఫై చేయాలి. దుర్వినియోగాన్ని నివారించడంలో సహాయపడటానికి, ప్రతి ఫోన్ నంబర్‌తో అనుబంధించగల ఛానెల్స్ సంఖ్యను మేము పరిమితం చేస్తాము.
- కొన్ని దేశాలు/ప్రాంతాలు అలాగే క్యారియర్‌లు Google నుండి టెక్స్ట్ మెసేజ్‌లను సపోర్ట్ చేయవు. చాలా మొబైల్ క్యారియర్‌లు Google నుండి టెక్స్ట్ మెసేజ్‌లను సపోర్ట్ చేస్తాయి. మీ క్యారియర్ Google నుండి వచ్చే టెక్స్ట్ మెసేజ్‌లను సపోర్ట్ చేయకపోతే, మీరు వాయిస్ కాల్ ఆప్షన్‌ను ట్రై చేయవచ్చు, లేదా వేరొక ఫోన్ నంబర్‌ను ఉపయోగించవచ్చు.
మీ మొదటి ప్రయత్నం తిరస్కరించబడితే, మీకు ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. మీ ఈమెయిల్‌లో అందించిన చిట్కాలను మీరు రివ్యూ చేయాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము, అంతే కాకుండా మీ ID ఈ కింద పేర్కొన్న వాటికి అనుగుణంగా ఉండేలా చూసుకోండి:
- అది డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, లేదా ఇతర చెల్లుబాటు అయ్యే ID అయి ఉండాలి
- అది గడువు ముగియనిది అయి ఉండాలి
- అందులో మీ పుట్టిన తేదీ స్పష్టంగా కనిపించాలి
- తప్పక కవర్ చేసి ఉంచాల్సిన ప్రైవేట్ సమాచారాన్ని అది చూపించకూడదు
రెండవ ప్రయత్నం విజయవంతం కాకపోతే, అందుబాటులో ఉన్న రెండు వెరిఫికేషన్ పద్ధతులలో ఏదో ఒక దాన్ని మళ్లీ ట్రై చేసే ముందు, మీరు 30 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. బదులుగా మీరు వేచి ఉండి, ఛానెల్ హిస్టరీని బిల్డ్ కూడా చేసుకోవచ్చు.
నా వీడియో వెరిఫికేషన్ తిరస్కరించబడింది. నేను ఏమి చేయగలను?
మీ మొదటి ప్రయత్నం తిరస్కరించబడితే, మీకు ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. మీ ఈమెయిల్‌లో అందించిన చిట్కాలను రివ్యూ చేయాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము, అంతే కాకుండా మీరు ఈ కింద అందించిన వాటిని తప్పక పాటించేలా చూసుకోండి:
- మీ ఫోన్‌ను మీ ముఖం ముందు కంటి స్థాయికి సమాంతరంగా పట్టుకోండి
- వెలుతురు మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ ఉన్న ప్రదేశంలో కాకుండా, తగినంత వెలుతురు ఉన్న ప్రదేశంలో రికార్డ్ చేయండి
- డాట్‌ను ఫాలో కావడం, లేదా మీ తలను తిప్పడం వంటి చర్యలను చేయడానికి ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి
- వీడియోలో మీరు మాత్రమే ఉండేలా చూసుకోండి
- Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయండి
రెండవ ప్రయత్నం విజయవంతం కాకపోతే, అందుబాటులో ఉన్న రెండు వెరిఫికేషన్ పద్ధతులలో ఏదో ఒక దాన్ని మళ్లీ ట్రై చేసే ముందు, మీరు 30 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. మీ రెండవ వీడియో వెరిఫికేషన్ ఆమోదం పొంది ఉండాల్సిందని మీరు భావిస్తే, దాన్ని అప్పీల్ చేయవచ్చు, అంతే కాకుండా అది ఆమోదం ఎందుకు పొంది ఉండాలి అనే విషయాన్ని మాకు తెలియజేయండి. బదులుగా మీరు వేచి ఉండి, ఛానెల్ హిస్టరీని బిల్డ్ కూడా చేసుకోవచ్చు.
ID వెరిఫికేషన్‌ను లేదా వీడియో వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి సంబంధించిన ఆప్షన్ నాకు ఎందుకు కనిపించడం లేదు?
మీకు బ్రాండ్ ఖాతా ఉన్నట్లయితే:
ఛానెల్ ప్రధాన ఓనర్‌కు మాత్రమే ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ చేయడానికి అర్హత ఉంటుంది. వారి వెరిఫికేషన్ స్టేటస్ ఆధారంగా, ఛానెల్‌కు చెందిన యూజర్‌లందరికీ ప్రధాన ఓనర్ లాగానే అవే ఫీచర్‌లకు యాక్సెస్ ఉంటుంది.
మీకు బ్రాండ్ ఖాతా లేకపోతే:
ఛానెల్ ఓనర్‌కు మాత్రమే ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ చేయడానికి అర్హత ఉంటుంది. వారి వెరిఫికేషన్ స్టేటస్ ఆధారంగా, ఛానెల్ యూజర్‌లందరికీ ఓనర్ లాగానే అవే ఫీచర్‌లకు యాక్సెస్ ఉంటుంది.
ఇది వయస్సు అంచనా నుండి ఎలా భిన్నంగా ఉంటుంది?